• Login / Register
  • వీడియోస్‌

    Vikarabad News | జిల్లా కలెక్టర్ పై గ్రామ ప్ర‌జ‌ల‌ దాడి

    Vikarabad News | జిల్లా కలెక్టర్ పై గ్రామ ప్ర‌జ‌ల‌ దాడి
    వికారాబాద్ జిల్లాల‌లో సంఘ‌ట‌న‌
    కండిస్తున్న ఉద్యోగ సంఘాలు 
    Hyderabad : రాష్ట్రంలోనే కాంగ్రెస్ స‌ర్కారుపై ప్ర‌జ‌లు తిరిగుబావుటా మొద‌లైంది. కాంగ్రెస్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. చివ‌ర‌కు జిల్లా క‌లెక్ట‌ర్‌, సంబంధిత అధికారుల‌పైనే గ్రామ ప్ర‌జ‌లు దాడుల‌కు దిగుతున్నారు. అలాంటి సంఘ‌ట‌న‌లు వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకోవ‌డంపై ఇటు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై ఓ మహిళ చేయి చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఫార్మా విలేజ్ భూసేకరణకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ జిల్లా కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామస్థులు నిరసన తెలిపారు. వారి అభ్యంతరం నేప‌థ్యంలో ఆ గ్రామానికి నేరుగా వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎమ్మార్‌వో పై ఆ గ్రామానికి చెందిన‌ రైతులు, గ్రామస్థులు దాడి చేశారు. అలాగే  వాహనాల అద్దాలు ప‌గుల‌గొట్టి ధ్వంసం అయ్యాయి. ఈ దాడి నేప‌థ్యంలో ప‌లు ఉద్యోగ సంఘాలతో పాటు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు, తాహ‌సీల్థారు సంఘాలు.. ఇలా ఉద్యోగ సంఘాల‌న్ని తీవ్రంగా కండించాయి.
    *  *  * 

    Leave A Comment